Site icon NTV Telugu

Ram Pothineni: ఓరీ మీ దుంపలు తెగ ఆపండ్రోయ్..

Ram

Ram

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కు కొదువే లేదు.. ఒక్కరి తరువాత ఒకరు పెళ్లితో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నా ఇంకా బ్యాచిలర్స్ మిగిలే ఉంటున్నారు. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టాప్ 10 లిస్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకడు. ఇటీవలే రామ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెల్సిందే. తన చిన్ననాటి స్నేహితురాలు, హై స్కూల్ ఫ్రెండ్ అయిన అమ్మాయిని రామ్ వివాహమాడుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో రామ్ కూడా త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటూ పలు మీడియా సైట్లు కూడా రాసుకొచ్చాయి.

ఇక తాజాగా ఈ వార్తలపై రామ్ స్పందించాడు. ఓరీ మీ దుంపలు తెగ ఆపండ్రోయ్.. అంటూ ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి కష్టపడ్డాడు. ట్విట్టర్ వేదికగా రామ్ పెళ్లి వార్తలకు చెక్ పెట్టాడు. “ఓరీ దేవుడా.. ఆపండి.. ఈ వార్తలు ఎక్కడివరకు వచ్చాయి అంటే..నేను నా హై స్కూల్ స్వీట్ హార్ట్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నాను అని ఇంట్లో వారు అడిగేవరకు.. చివరకు మా ఇంట్లోవారికి, స్నేహితులకు అందులో నిజం లేదు అని నేను కన్విన్స్ చేసే పరిస్థితి ఏర్పడింది. నిజం చెప్పాలంటే నేను చిన్నప్పుడు సరిగ్గా స్కూల్ కు కూడా వెళ్లేవాడిని కాదు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రామ్ పెళ్లి రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడినట్లే.

ఇక ఈ ట్వీట్ పై అభిమానులు మరోరకంగా కామెంట్స్ పెడుతున్నారు.. ఓ అన్నా నువ్వు కూడా మా టైపేనా..? స్కూల్ కు వెళ్లకుండా జ్వరం వచ్చిందని ఇంట్లో పడుకొనేవాడివా..? లేక ఫ్రెండ్స్ తో బయటికి చెక్కేసేవాడివా..? అని కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా రూమర్స్ కు అయితే చెక్ పెట్టాడు కానీ, పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం చెప్పకుండా ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ గా తప్పించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం రామ్, లింగుసామి దర్శకత్వంలో ది వారియర్ అనే మూవీలో నటిస్తున్నాడు. జూలై 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా తరువాత ఏమైనా రామ్ శుభవార్త చెప్తాడేమో చూడాలి.

Exit mobile version