టాలీవుడ్ ట్రెండ్ మారింది. లవ్ స్టోరీస్, యాక్షన్ ఎపిసోడ్లను పక్కకు పెట్టి హారర్, మైథాలజీ, సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రాల వైపుగా అడుగులేస్తోంది. హనుమాన్, విరూపాక్ష, పొలిమేర, కల్కి చిత్రాలను ఆడియన్స్ కొత్తగా ఫీలై హిట్స్ ఇవ్వడంతో వీటిపై కాన్సట్రేషన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఇండస్ట్రీలో ఏది నడిస్తే అదే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి హీరోలది. ట్రెండ్‌కు తగ్గట్టుగా మారిపోతున్నారు. చిరంజీవి విశ్వంభర, ప్రభాస్.. నిఖిల్ స్వయంభు, తారక్- త్రివిక్రమ్ కథలు సోషియో ఫాటసీ అండ్ మైథాలజీ రిలేటెడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు.
Also Read : Kannappa : కన్నప్పలో ఆ సీన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్
మైథాలజీ మాత్రమే కాదు సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రాలకు సై అంటున్నారు హీరోస్. ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్, అతీంద్రియ శక్తులు వంటి కాన్సెప్టులపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ జోనర్‌లోకి ఎంటర్ కాబోతున్నారు రామ్ పోతినేని. మాస్ ఇమేజ్ కోసం పరుగులెత్తి యూ టర్న్ తీసుకున్న రాపో ఇప్పుడు అతీంద్రియ శక్తుల కాన్సెప్టు కథతో రాబోతున్నాడట. ఈ కథ ఫస్ట్ రానా నుండి చైతూ ఆపై రామ్ దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. కిశోర్ అనే కొత్త దర్శకుడి ఛాన్స్ ఇస్తున్నాడట రామ్. ఈ సినిమాను ఆర్కా మీడియా నిర్మిస్తుండగా రానా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకాతో బిజీగా ఉన్న ఈ ఎనర్జటిక్ స్టార్ ఈ ఇయర్ఎండింగ్ నుండి ఈ ప్రాజెక్టును పట్టలెక్కించనున్నాడని టాక్. మొత్తానికి టాలీవుడ్ మారుతోంది. రొటీన్ మాస్ కథలను పక్కనపెట్టి విభిన్న కథలతో సినిమాలు చేసేందుకు కుర్ర హీరోలు ముందుకు వస్తున్నారు. ఇక ప్రేక్షకుల నుండి రెస్సాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
