NTV Telugu Site icon

RAPO : రామ్ పోతినేని.. చందు మొండేటి.. మ్యాటర్ ఏంటంటే..?

Ram

Ram

ఉస్తాద్ రామ్ పోతినేని చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్నాడు. 2019 లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో భారీ మాస్ హిట్ అందుకున్న రామ్ మరల ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు వేటికవే భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం మహేష్ బాబు. పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆంధ్రాలో షూటింగ్ జరుగుతుంది.

Also Read : Nithiin : రాబిన్ హుడ్ ఇది సరిపోదు.. ఇంకా స్పీడ్ పెంచాలి

కాగా ఈ సినిమా తర్వాత రామ్ నెక్ట్స్ సినిమా పై రోజుకొక న్యూస్ తెరపైకి వస్తున్నాయి. తాజాగా రామ్ పోతినేని హీరోగా తండేల్ దర్శకుడు చందు మొండేటి హీరోగా ఓ సినిమా రాబోతుంది అని టాలీవుడ్ సిర్కిల్స్ లో టాక్ వినిపించింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని టాక్ నడిచింది. ఈ విషయమై రెండు టీమ్స్ ను ఆరా తీయగా అదేం లేదని ఫేక్ న్యూస్ అని వివరణ ఇచ్చారు. రామ్ ప్రస్తుతం కథలు వింటున్నాడు తప్ప ఏది ఫైనల్ చేయలేదని తెలిసింది. ఆ మధ్య మరో దర్శకుడు హరీష్ శంకర్ కూడా కథ వినిపించాడు కానీ ఫైనల్ కాలేదని సమాచారం. ఆయన గత చిత్రం ఏంటది దారుణ ఫలితం రాబట్టిందో తెలిసిందే. డబుల్ ఇస్మార్ట్ డిజిస్టర్ తో మేల్కొన్న రామ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. మాస్ ఇమేజ్ వెంట పరిగెత్తకుండా కలిసొచ్చిన లవ్ స్టోరీ జానర్ లో సినిమా చేస్తున్నాడు. ఇకనుండి రామ్ కాంబోలు నమ్ముకుని కాకుండా కథ నమ్ముకుని సినిమాలు చేయడం సంతోషం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.