NTV Telugu Site icon

Ram Gopal Varma: గరికపాటి చూపంతా ఆ హీరోయిన్ మీదే ఉందట.. వర్మ వీడియో వైరల్

Varma

Varma

Ram Gopal Varma:ఏ ముహుర్తానా గరికపాటి, చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేశారో కానీ అప్పటి నుంచి ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. మెగా ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వీరితో పాటు నేను కూడా ఉన్నాను అంటూ ముందుకొచ్చేశాడు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. టాపిక్ ఏదైనా సంచలనం చేయడంలో మాత్రం ముందు ఉంటాడు వర్మ. ఇక గరికపాటిని గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నాడు. ట్వీట్స్, వీడియోస్ తో ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. ఇక తాజాగా ఒకానొక సందర్భంలో గరికపాటి, హీరోయిన్ అనుష్కను పొగిడిన ఒక వీడియోను పోస్ట్ చేస్తూ ” ఓహో మీరుకూడానా బాహు(గరిక) బలి(పాటి) గారు” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ఇక ఆ వీడియో లో గరికపాటి మాట్లాడుతూ “ఏమున్నదని ఈ కుర్రాళ్లందరూ చూస్తున్నారు అని చూసాను.. నా చూపు కూడా ఒక చోట నిలిచిపోయింది. చేసిన తప్పు చెప్పాలి గా.. ఆమె ఎవరో కాదు మహానటి అనుష్క. అలా నిలబడి ఉంది.. ఒక మంచి పోజ్.. మనం కవి కదా, ఊరికే ఎలా ఉండగలం.. చూసా పైనుంచి కిందకు. ఒకరోజు పేపర్ చదువుతుంటే ముందు రాజకీయాలు చూస్తున్నా .. మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు.. వాడు నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. నేను అనుకున్నాను స్నానం చేసొచ్చి నా కాళ్లకు దండం పెడుతున్నాడు అనుకున్నాను.. కాదు అక్కడ ఉన్న అనుష్క ఫోటో చూస్తున్నాడు చిత్ర జ్యోతిలో.. వాడు ధోరణిలో వాడు ఉన్నాడు. నా ధోరణిలో నేను ఉన్నాను. దానికేముందు ఎవడికి కావాల్సింది వాడు చూసుకుంటున్నాడు. ఏంట్రా అని అడగానే టక్కుమని వెళ్ళిపోయాడు. ఏంటా అని నేను చూసాను.. వాడిని పంపాను కానీ మన దృష్టి తిన్నదైంది కాదుగా.. ఇక ఆ ఫోటో చూసేసరికి వీడు ఈ అమ్మాయిని చూడడంలో తప్పే లేదు మరీ.. నన్నే ఆకర్షిస్తుంటే వాడిని ఆకర్షించదా..?” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.