వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆయన ఏమి మాట్లాడినా సంచలనమే.. ఆయన ఏమి చేసినా వివాదమే.. ట్విట్టర్ లో ఆయన ట్వీట్లు షేక్ ఆడిస్తాయి.. జనాలు ఎవరు ఏమి అనుకున్నా తన పంథా తనదే అంటూ దూసుకుపోతుంటాడు. ఇక తాజాగా హుజురాబాద్ ఎన్నికలు నడుస్తున్న వేళ ఆర్జీవీ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. హుజురాబాద్ ఎన్నికల గురించి మాట్లాడుతూ” ఆ ఎన్నికలకు, నాకు ఎలాంటి సంబంధం లేదని, తానెప్పుడూ వాటి గురించి మాట్లాడలేదని చెప్పారు. కొందరు కావాలనే తాను ఆ ఎన్నికల గురించి మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నట్లు” చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం తెలంగాణ యావత్తు హుజూరాబాద్ వైపే చూస్తోంది. నేటి రిజల్ట్ తో ఎవరు విజేతో కూడా తెలుస్తున్న నేపథ్యంలో వర్మ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. తానేమి మాట్లాడకపోయినా తనను వివాదంలోకి లాగుతున్నారు అని చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు వర్మను ట్రోల్స్ చేస్తున్నారు. వివాదాల గురించి వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అయిన వ్యక్తి మాట్లాడుతుంటే నవ్వొస్తోందని కొందరు.. పాలిటిక్స్ గురించి వర్మ మాట్లాడలేదు అంటే నమ్మేవారు లేరులే అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
