NTV Telugu Site icon

Ram Gopal Varma: బిగ్ బ్రేకింగ్.. వర్మ కొత్త ఛానెల్.. వివేకా మర్డర్ కేసు స్పెషల్

Varma

Varma

Ram Gopal Varma:వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్.. సంచలనాలకు పర్మినెంట్ అడ్రెస్స్ రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే.. ఏం చేసినా వివాదమే. సినిమాలు, రాజకీయాలల్లో వర్మ వేలు పెట్టడం సర్వ సాధారణమే. ఆయనకు నచ్చని విషయం ఏదైనా ఉన్నా.. సినీ, రాజకీయాల్ల ఏదైనా కీలక ఘట్టం జరిగినా టక్కున మీడియాఛానెల్స్ ముందు వాలిపోతారు. దాని గురించి అనాలసిస్ చేసి.. అది అలా జరిగింది.. ఇది ఇలా జరగాలి. వారు ఆ మాట అనాలి. వీరు ఇలా ఉండాలి అంటూ తన ఒపీనియన్ చెప్పుకొచ్చేస్తాడు. ఎదుటివారు వింటారా..? వినరా..? అనేది ఆయనకు అవసరం లేదు. ఇక రాజకీయ పరంగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను హీటేక్కిస్తున్న విషయం వివేకానంద రెడ్డి హత్య కేసు. గత కొన్నిరోజులుగా ఈ కేసుపై వాదోపవాదాలు, విచారణలు జరుగుతున్న విషయం తెల్సిందే.

ఇక ఈ కేసుపై నిజం నిగ్గు తేల్చడానికి రెడీ అయ్యాడు వర్మ. అయితే ఈసారి ఆ ఛానెల్ ను, ఈ ఛానెల్ ను నమ్ముకోకుండా సొంతగా యూట్యూబ్ ఛానెల్ పెట్టేసాడు. అంతకుముందు వర్మ పేరుమీద ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. అయితే అది కేవలం సినిమాలకు మాత్రమే. ఇక ఇప్పుడు నిజం అనే పేరుతో మరో ఛానెల్ ను పెడుతున్నట్టు వర్మ అధికారికంగా ప్రకటించాడు. “నేను ప్రారంభించబోయే”నిజం” YouTube ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారెస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది నిజం ఛానెల్ లాంచ్.. 25 వ తేదీ సాయంత్రం 4 గంటలకు” అంటూ ట్వీట్ చేశాడు.

మరో ట్వీట్ లో “వివేకా మర్డర్ వెనక నిజం లోని అబద్ధాలు,ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు,ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్లు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు ,వాటన్నింటి వెనుక నిజాలన్నింటినీ తవ్వి తీయడమే “నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ట్వీట్స్ చూసిన అభిమానులు మంచిది గోపాల్ గారు మీరు నమ్మినది నిజం అని చెపుతారా? లేక నేను నిజం అయితేనే చెపుతాను అంటారా? నేను చెప్పిందే నిజం అంటారా? ఏది నిజం?? పక్షపాతం లేకుండ నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పండి మీ నైజం లో అని కొందరు.. వివేకాపై ఒక బయోపిక్ తీసేయ్ అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి వర్మ ఎవరి బట్టలు ఊడదీసి.. ఎవరి నగ్న స్వరూపం బయటపెడతాడో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Show comments