NTV Telugu Site icon

Ram Gopal Varma: పవన్ తో నీకు పోలికేంటి.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది

Varma

Varma

Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అమెరికాలో రచ్చ చేస్తున్నాడు. నాటా సభల కోసం అమెరికా వెళ్ళిన వర్మ అమెరికాను దున్నేస్తున్నాడు. చూడాల్సిన ప్లేస్ లు, కలవాల్సిన మనుషులును కలుస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. పోర్న్ స్టార్స్ ను కలవడం, నగ్న ఫోటోల ముందు ఫోటోలు దిగడం లాంటివి చేస్తూ నెట్టింట దుమారం రేపుతున్నాడు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ఆయన దిగిన ప్రతి ఫోటోకు పవన్ కళ్యాణ్ ఫోటోను పక్కన పెట్టి.. సేమ్ కాదు అంటూ రాసుకొస్తున్నాడు. అదే ప్రస్తుతం నెటిజన్స్ కు ఆగ్రహం తెప్పిస్తున్న విషయం. ఇంతకుముందు పవన్ పూజ చేస్తున్న ఫోటో పక్కన.. ఆయన అమెరికాలో దిగిన ఫోటోను యాడ్ చేసి .. ” కొంతమంది నా వంక జెలసీగా చూస్తున్నారెందుకో ” అంటూ క్యాప్షన్ పెట్టాడు.

Crime News: బ్రేకింగ్.. పురుషాంగం కోసుకొని వైద్య విద్యార్థి ఆత్మహత్య..

ఇక తాజాగా అచ్చు పవన్ కళ్యాణ్ లా పోజ్ పెట్టి ఫోటో దిగి, దానిపక్కన పవన్ కళ్యాణ్ ఫోటో యాడ్ చేసి.. సేమ్ టు సేమ్ కాదు అంటూ రాసుకొచ్చాడు. ఇక పవన్ పక్కన వర్మను అలా చూసి పవన్ ఫ్యాన్స్ యే కాదు నెటిజన్స్ కూడా ఏకిపారేస్తున్నారు. నీకు ఆయనకు పోలిక ఏంటి.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది.. పవన్ తో నీకు పోలిక ఏంటి.. ఆయన వేరు.. నువ్వు వేరు అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments