Site icon NTV Telugu

Ram Gopal Varma: తగ్గేదేలే.. గరికిపాటిని గడ్డిపరకతో పోల్చిన ఆర్జీవీ

Varma On Garikipati

Varma On Garikipati

Ram Gopal Varma Sensational Tweets On Garikipati Narasimha Rao: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి విజృంభించాడు. ఈసారి ఆయన గరికిపాటి నరసింహా రావుని టార్గెట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవిని అభిమానించిన వాడు గడ్డిపరకతో సమానమని, చిరంజీవి జోలికొస్తే మెగాభిమానిగా తాను కూడా వెనక్కు తగ్గేదే లేదంటూ కుండబద్దలు కొట్టాడు. తొలుత నాగబాబు చేసిన ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ.. ‘‘ఐ యాం సారీ నాగబాబు, మెగాస్టార్‌ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు, మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రకతో సమానం, త్తగ్గేదెలే’’ అని సంచలన ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ‘‘హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతేకాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు, మెగాస్టార్ చిరంజీవి ఏనుగు, నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో’’ అంటూ మరో ట్వీట్‌లో వర్మ చెలరేగిపోయాడు.

ఆ తర్వాత ‘‘హే గూగురుపాటి నరసింహ రావు, తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి’’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. అనంతరం.. ‘‘నాగబాబు సర్, మీ అన్నయ్యని ఆ గడ్డి అన్న మాటలకి, దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రికని మంటలలో మండించకపోతే, ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు’’ అని ఇంకో ట్వీట్ చేశాడు. ఈ విధంగా రెచ్చిపోయి వర్మ చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకుముందు.. ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే, ఆ పాటి అసూయ పడటం పరిపాటే’ అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌కి చేతులెత్తి నమస్కరించే ఎమోజీతో పాటు పగలబడి నవ్వే ఎమోజీలతో రీట్వీట్ చేశాడు.

కాగా.. ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో గరికిపాటి నరసింహ రావు, చిరంజీవి మధ్య చోటు చేసుకున్న సంఘటన అందరికీ తెలిసిందే! అభిమానులతో చిరంజీవి ఫోటోలు దిగుతుండగా.. ఫోటో సెషన్ ఆపేస్తే తాను మాట్లాడుతానని, లేదంటే వెళ్లిపోతానని గరికిపాటి అన్నారు. దీనిపై అప్పుడు పెద్ద దుమారమే రేగింది. నాగబాబు సహా మెగాభిమానులందరూ గరికిపాటిని టార్గెట్ చేసి, నెట్టింట్లో విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ వివాదం ఇప్పుడు చల్లారిందనుకుంటున్న తరుణంలో.. రాంగోపాల్ వర్మ తన ట్వీట్లతో మళ్లీ దానికి ఆజ్యం పోశాడు.

https://twitter.com/RGVzoomin/status/1579502043399852034?s=20&t=VH8lpC3fYffiU7ITRtifoQ

Exit mobile version