Site icon NTV Telugu

వర్మ సంచలన ట్వీట్ : ఆనందయ్యను కిడ్నాప్ కాకుండా కాపాడండి !

RGV

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తున్న స‌మ‌యంలో.. కృష్ణపట్నం పేరు మారుమ్రోగుతోంది. కరోనాకు ఉచితంగా మందుపంపిణీ చేస్తుండ‌డంతో.. ఇప్పుడు వేలాది మంది అటు ప‌రుగులు తీస్తున్నారు. ఆనంద్ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు.. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. అయితే ఈ మందుపై ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య నిపుణులు పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గురించి వర్మ తనదైన శైలిలో స్పందించాడు. “ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్ణ పట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, డా. ఫౌసీ వస్తున్నారని విన్నాను.. ఆనందయ్యతో కరోనా రేసిపీ కోసం డీల్ కుదుర్చుకోవడానికై ఉండవచ్చు. ఏ నేపథ్యంలో ఆనందయ్యను కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి..మిలటరీ భద్రత కల్పించాలి. అంతే కాదు ఉచితంగా ఆనందయ్య మందు ఇవ్వడం గొప్ప నిర్ణయం. అతనికి నోబెల్ బహుమతి ఇవ్వాలి” అని వర్మ ట్వీట్ చేశారు.

Exit mobile version