వైవిధ్యానికి మారు పేరు రామ్ గోపాల్ వర్మ అంటారు అభిమానులు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్నది అనేకుల మాట. రామ్ గోపాల్ వర్మ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన లేవనెత్తే వివాదాలే! ఒకటా రెండా ఏదో విధంగా వార్తల్లో నిలవడమే వర్మకు మహా ఇష్టం. ఎవరో ఒకరిని అడ్డంగా విమర్శించి వివాదానికి తెరలేపుతారాయన. తద్వారా తన తాజా చిత్రాలకు ఆ వివాదాలనే ప్రచారంగానూ మలచుకుంటారు. దటీజ్… వర్మ అనిపిస్తారు!
తొలి చిత్రం ‘శివ’తోనే ఎంతోమందిని అభిమానులుగా మార్చుకున్నారు వర్మ. ఇక నంది అవార్డుల్లోనూ మూడు సార్లు ఉత్తమ దర్శకునిగా నిలిచారు. ఉత్తరాదిని తనదైన బాణీతో ఉడికించారు. ఒకప్పుడు వర్మ చేయి తగిలితే చాలు అనుకొనే అభిమానులు ఉండేవారు. ఇప్పుడు వారే ఆయనను చూసి మొహం చాటేసుకుంటున్నారు. అది ఆయనను నిజంగా అభిమానించేవారికి బాధ కలిగిస్తోంది. అయినా, తన రూటే సెపరేటు అనుకుంటూ సాగుతున్నారు రాము. ఇప్పటి కుర్ర దర్శకులకు సైతం సాధ్యం కాని విధంగా సినిమాలను చకచకా తెరకెక్కించేస్తున్నారు. ఓ వెబ్ సీరిస్ తో పాటు ‘డేంజరస్’ అనే ఇండియన్ ఫస్ట్ లెస్బియన్ మూవీని రూపొందించారు వర్మ. మరో వైపు కొండాదంపతుల కథతో ‘కొండా’ తెరకెక్కించారు. అంతకుముందు ‘లేడీ బ్రూస్లీ’ అంటూ మరో సినిమా తీసేశారు. ఇవన్నీ ఇప్పుడు జనం ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ముందుగా ‘డేంజరస్’ రానుంది. తెలుగులో ‘మా ఇష్టం’గా ఈ సినిమా జనం ముందు నిలవనుంది.
ఏప్రిల్ 7తో వర్మకు 60 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఆ మరుసటి రోజునే అంటే ఏప్రిల్ 8న స్త్రీ స్వలింగసంపర్కులపై వర్మ తెరకెక్కించిన ‘మా ఇష్టం’ విడుదలవుతోంది. ఈ సినిమాలో నటించిన అమ్మాయిలను వెంట పెట్టుకొని రాము ప్రచారపర్వంలో పదనిసలు పలికిస్తూ సాగుతున్నారు. ఆ ముచ్చట కూడా సినీజనానికి ఆసక్తి కలిగిస్తోంది. మరి ఈ సినిమాతో వర్మ ఎలాంటి లాభాలు చూస్తారో చూడాలనీ సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తరువాత రాబోయే ‘లేడీ బ్రూస్లీ, కొండా’ సినిమాలపై కూడా జనం ఫోకస్ పెట్టేలా రాము ప్రణాళికలు రచించి ఉంటారనీ అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఆరు పదుల వయసు దాటుతున్నా, రాము వేగంగా సినిమాలు తెరకెక్కించడం విశేషమనే చెప్పాలి. పైగా, మారుతున్న కాలానికి అనుగుణంగా వర్మ టెక్నాలజీతో సాగే వైనం కూడా సినీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూనే
