Site icon NTV Telugu

‘అమ్మాయి’ ట్రైలర్: బెడ్ పై పడుకొనే అమ్మాయి ఏం చేయగలదో చూపించిన వర్మ..

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి రెడీ అయిపోయాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘లడకీ.. ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ విడుదలకు సిద్దమవుతుంది. . ఇండియాలోని ఫస్ట్ ఫిమేల్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో పూజ భలేఖర్ హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమవుతుంది. ఇండో-చైనీస్ జాయింట్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ హిందీ, చైనా లో రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందగా తెలుగులో ఈ చిత్రాన్ని ‘అమ్మాయి’ పేరుతో డిసెంబర్ 10 న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇక ఈ నేపథ్యంలోనే అమ్మాయి ట్రైలర్ ని వర్మ రిలీజ్ చేశాడు.

ట్రైలర్ విషయానికొస్తే బ్రూస్ లీ అంటే పిచ్చిగా అభిమానించే పూజా అనే అమ్మాయి.. ఆయనలా మార్షల్ ఆర్ట్స్ లో నెంబర్ 1 గా మారాలనుకొంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని ఒక అమ్మాయి ఎలా ఎదుర్కొంది.. చివరికి తాను అనుకున్నది సాధించిందా..? లేదా..? అనేది కథగా తెలుస్తోంది. ఇక ట్రైలర్ చూస్తుంటే వర్మ మార్క్ పక్కా కనిపిస్తోంది.. పూజా భలేకర్ ఒకపక్క ఫైటర్ గా.. మరోపక్క హాట్ హాట్ అందాలను చూపిస్తూ ప్రియుడితో రొమాన్స్ చేసే అమ్మాయిగా ఆకట్టుకొంది. యాక్షన్, రొమాన్స్ , లవ్ అన్ని పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి ఈ సినిమాతో వర్మ విజయాన్ని అందుకుంటాడా లేదో చూడాలి.

Exit mobile version