Site icon NTV Telugu

“ఆర్ఆర్ఆర్”తో ఒమిక్రాన్ కు చెక్… ప్రభుత్వానికి ఆర్జీవీ సలహా

RRR

కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. ఇప్పుడు మరోసారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచం మొత్తం భయాందోళనలను సృష్టించింది. తాజాగా బయటపడిన మరో వేరియంట్ డెల్మిక్రాన్ హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ప్రజలను జాగ్రత్తగా ఉండమని కోరుతూ, మరోమారు లాక్ డౌన్ పరిస్థితులు రాకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అయితే కొంతమంది ఇంకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకోలేదు. అది తీసుకుంటే కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా తగ్గుతుందనేది వైద్యుల సలహా. అయితే ప్రస్తుత పరిస్థితుల మధ్య భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ఫీవర్ పట్టుకుంది. దీంతో సినిమాను ప్రజల జాగ్రత్త కోసం ఎలా వాడుకోవచ్చో తెలుపుతూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు.

“ఒమిక్రాన్ గురించి ప్రభుత్వానికి చెప్పడానికి నా దగ్గర ఒక గొప్ప ఆలోచన ఉంది. ప్రేక్షకులను డబుల్ డోస్ వేసుకున్నట్టుగా రుజువు చూపితే తప్ప #ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి అనుమతించకూడదు. అప్పుడు #ఆర్ఆర్ఆర్ ను చూడాలనే కోరిక ప్రజల అజాగ్రత్తను జయిస్తుంది” అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాగా రామ్ గోపాల్ వర్మ ప్రతిరోజూ ఏదో ఒక ట్వీట్‌తో హెడ్‌లైన్స్‌లో ఉంటాడన్న విషయం తెలిసిందే. మరోవైపు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్’ వాయిదా పడుతుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

https://ntvtelugu.com/rajamouli-directs-salman-on-bigg-boss-15-stage/
Exit mobile version