Peddi OTT : ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన పెద్ది.. ఎక్కడ చూడాలంటే

Peddi Ott

Peddi Ott

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా థియేట్రికల్ రన్ ముగించుకుని, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త రగ్గడ్ లుక్ మరియు ఎమోషనల్ బాడీ లాంగ్వేజ్‌తో అదరగొట్టారు. ఒక గ్రామీణ నేపథ్యం కలిగిన క్రీడ చుట్టూ తిరిగే ఈ కథలో భావోద్వేగాలను, స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌ను దర్శకుడు బుచ్చిబాబు సనా డీసెంట్ గా హ్యాండిల్ చేసాడు. జూన్ 4న థియేటర్లలో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులను  మెప్పించి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘పెద్ది’ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం అలాగే హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రామ్ చరణ్ నటన, ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో మిస్ అయితే ఈ వీకెండ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న పెద్ది ఎలాంటి రెస్పాన్స్ రాబడుతుందో చూడాలి.