మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ భారీ గ్రామీణ క్రీడా చిత్రం పెద్ది. రిలీజ్ కు నెల ముందుగానే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 4 గంటల్లోనే 100 వేల డాలర్ల $100K మార్కును దాటి ఈ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది.
సాధారణంగా పెద్ద సినిమాలకు ట్రైలర్ విడుదలైన తర్వాత బుకింగ్స్‌లో జోరు కనిపిస్తుంది. కానీ ‘పెద్ది’ విషయంలో కేవలం పోస్టర్లు, రెండు గ్లింప్స్ వీడియోలు మరియు రెండు పాటలతోనే ఈ స్థాయి స్పందన రావడం అంటే క్రేజ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమాకు జరగని రీతిలో టికెట్ల అమ్మకాలతో 24 గంటలలోపే ఆల్-టైమ్ రికార్డును ‘పెద్ది’ సొంతం చేసుకుంది. రామ్ చరణ్ మాస్ ఇమేజ్ మరియు బుచ్చిబాబు మేకింగ్‌పై ఉన్న నమ్మకమే ఈ ప్రభంజనానికి కారణమని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్ విడుదల చేస్తోంది. కేవలం అమెరికాలోనే కాకుండా శ్రీలంక, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి పలు దేశాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు జూన్ 3వ తేదీనే ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోలతో రిలీజ్ అవుతుంది. త్వరలోనే చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే సిద్ధమైన ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయమని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
