RC 16 : రేస్ గుర్రంలా RC 16 షూట్.. రిలీజ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఆరంభంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ తో మెగాభిమానులు డీలా పడ్డారు. ఈ సినిమా ఫలితం నుండి తేరుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సారి భారీ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో మరోసారి చూపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ కోవలోనే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కు ఛాన్స్ ఇచ్చాడు. చెర్రీ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో చేస్తున్నాడు. ఇటీవల నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర యూనిట్.
Also Read : NKR 21 : అర్జున్ S/O వైజయంతి రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
ప్రస్తుతం Rc16 షూటింగ్ ఎక్కువ బ్రేకులు,గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. VFX వర్క్స్ ఏమిలేకపోవడంతో షూటింగ్ ను పరిగెత్తిస్తున్నాడు బుచ్చిబాబు. కనుక వీలైనంత ఫాస్ట్ గా ఈ స్పోర్ట్స్ డ్రామా ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. దర్శకుడు బుచ్చి బాబు కి ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం దొరికింది. దీంతో మేకింగ్ త్వరగా అయిపోతుంది. అన్ని అనుకూలిస్తే ఈ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బిగ్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడట రామ్ చరణ్. కాగా ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్ అనుకోలేదట. త్వరలో చిన్న షెడ్యూల్ కోసం యూనిట్ ఢిల్లి వెళ్లనుంది. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో పాటు వృద్ధి సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!