NTV Telugu Site icon

RC 16 : రేస్ గుర్రంలా RC 16 షూట్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Rc16

Rc16

ఈ ఏడాది ఆరంభంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ తో మెగాభిమానులు డీలా పడ్డారు. ఈ సినిమా ఫలితం నుండి తేరుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సారి భారీ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో మరోసారి చూపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ కోవలోనే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కు ఛాన్స్ ఇచ్చాడు. చెర్రీ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో చేస్తున్నాడు. ఇటీవల నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర యూనిట్.

Also Read : NKR 21 : అర్జున్ S/O వైజయంతి రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రస్తుతం Rc16 షూటింగ్ ఎక్కువ బ్రేకులు,గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. VFX వర్క్స్ ఏమిలేకపోవడంతో షూటింగ్ ను పరిగెత్తిస్తున్నాడు బుచ్చిబాబు. కనుక వీలైనంత ఫాస్ట్ గా ఈ స్పోర్ట్స్ డ్రామా ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. దర్శకుడు బుచ్చి బాబు కి ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం దొరికింది. దీంతో మేకింగ్ త్వరగా అయిపోతుంది. అన్ని అనుకూలిస్తే ఈ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు బిగ్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడట రామ్ చరణ్. కాగా ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్  అనుకోలేదట. త్వరలో చిన్న షెడ్యూల్ కోసం యూనిట్ ఢిల్లి వెళ్లనుంది.  ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో పాటు వృద్ధి సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.