Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారాడు. ఇక మరోపక్క భార్య ప్రెగ్నెంట్ కావడంతో చరణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇకపోతే మొదటి నుంచి చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొడుతుంటాడు. ముఖ్యంగా చరణ్ వాడే వాచీలు, షర్ట్ లు ధరలు వింటే దిమ్మ తిరిగిపోతూ ఉంటాయి. ఇక ఈ మధ్యనే ఉపాసన వేసుకున్న ఒక రెడ్ డ్రెస్ ధర లక్ష పైనే.. దానికి అందరు నోళ్లు నొక్కుకున్నారు. ఇక తాజాగా చరణ్ సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న విషయం తెల్సిందే. మెగా కజిన్స్ అందరు ఒక దగ్గర చేరి సరదాగా సమయం గడిపారు.
ఇక ఈ ఫోటోలు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియామీడియాను కుదిపేస్తున్నాయి. అందులో అందరి చూపు చరణ్ షర్ట్ పైనే ఉండడంతో .. ఆ షర్ట్ ధర ఎంతో తెలుసుకోవాలని అభిమానులు ఆశపడి శరత్ ధర తెలిశాకా అవాక్కయ్యారు. అవును ఆ ఒక్క షర్ట్ ధర అక్షరాలా.. రూ.1,21,840. లైట్ బ్లూ కలర్ షర్ట్ పై ప్యాచ్ డిటైల్ వర్క్ చేయబడింది. ఈ షర్ట్ బ్రాండ్ వచ్చేసి జున్యా వతనాబే అని తెలుస్తోంది. ఇక ఈ ధర చూసి అభిమానులు కళ్లు తేలేస్తున్నారు. ఏంటి బ్రో ఒక షర్ట్.. లక్షా పాతిక వేలా.. నలుగురు స్లైస్ కార్డుల బిల్ కట్టొచ్చు.. ఒక మిడిల్ క్లాస్ యువకుడి నాలుగు నెలల జీతం నాటు చెప్పుకొస్తున్నారు. ఇక మరికొంతమంది ఏదిఏమైనా ఆ షర్ట్ చరణ్ కు బావుంది.. మెగా పవర్ స్టార్ అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలి కదా అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
