మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన కొత్త లవ్ తో వార్తలో నిలిచారు. ఇది ఖచ్చితంగా ఉపాసనకు షాక్ అంటున్నారు నెటిజన్లు. అయితే అది ఫన్నీ వే లోనే..! విషయమేమిటంటే… చరణ్ తాజాగా తన కొత్త కుక్క పిల్లను అభిమానులకు పరిచయం చేశాడు. దానికి రైమ్ అనే పేరును కూడా పెట్టాడు. ఈ ఫోటోలు చూస్తుంటే చరణ్ ఎక్కడికి వెళ్లినా అది ఆయనను వదిలేలా కన్పించడం లేదు. ఏకంగా చరణ్ పైనే ఉంటూ తన ప్రేమను వ్యక్తపరుస్తోంది. ఇటీవల కాలంలో సెలెబ్రిటీలంతా మూగజీవాల ప్రేమలో పడిపోయారు. సామ్, రష్మిక, కీర్తి సురేష్ తన కుక్కపిల్లను సోషల్ మీడియాలో ఇప్పటికే పరిచయం చేశారు. ఇప్పుడు చరణ్ కూడా తన కొత్త కుక్క పిల్లను పరిచయం చేయడం విశేషం.
చరణ్ కొత్త లవ్… ఉపాసనకు షాక్
