Site icon NTV Telugu

సోదరితో రామ్ చరణ్… ముంబైలో ఏం చేస్తున్నాడు?

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబయిలో సౌకర్యవంతమైన అవుట్ ఫిట్ తో స్మార్ట్ లుక్ లో కనిపించాడు. చరణ్‌తో పాటు ఆయన సోదరి శ్రీజ, పెంపుడు కుక్క రైమ్ కూడా ఉండడం గమనార్హం. ఈ పిక్ లో చరణ్ లేత గోధుమరంగు టీ-షర్ట్‌లో దానికి మ్యాచింగ్ జాకెట్, నీలిరంగు జీన్స్‌ ధరించాడు. చెర్రీ పిక్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ తన సోదరితో కలిసి ముంబైలో ఎందుకు ఉన్నారనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ఇటీవల శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్‌తో విడిపోయింది అనే వార్తలతో అందరి దృష్టిలో పడింది. శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్ నుండి భర్త ఇంటిపేరును తొలగించి, అతనిని అన్‌ఫాలో చేయడంతో ఆమె కళ్యాణ్ దేవ్ నుండి విడిపోవాలని యోచిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ పుకార్లపై శ్రీజ కానీ, మెగా కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

Read Also : టీమ్ ఇండియా U19 స్కోర్‌ బోర్డ్‌ లో స్టార్ హీరో పేరు!!

ఇదిలా ఉంటే రామ్ చరణ్… జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు తన పాన్ ఇండియన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చెర్రీ, తారక్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను పోషించనున్నారు. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మారిసన్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ COVID-19 కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు మేకర్స్ మార్చి 18 లేదా ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

Exit mobile version