NTV Telugu Site icon

Ram Charan: ఇండస్ట్రీకి మీరే నిజమైన గేమ్ ఛేంజర్.. చరణ్ ట్వీట్ వైరల్

Charan

Charan

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. శంకర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దర్శకత్వంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయి. ఇప్పటివరకు శంకర్ తీసిన ప్రతి సినిమా ఒక కళాఖండమే అని చెప్పాలి. 1993 లో అర్జున్ హీరోగా తెరకెక్కిన జెంటిల్ మ్యాన్ సినిమాతో శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా వచ్చి నేటికీ 30 ఏళ్ళు. అంటే శంకర్ కెరీర్ ను మొదలుపెట్టి 30 ఏళ్ళు అవుతుంది. దీంతో సినీ ప్రముఖులు డైరెక్టర్ శంకర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ చిత్ర బృందాలు.. ఈ అకేషన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాయి. శంకర్ చేత కేక్ కట్ చేయించి.. శుభాకాంక్షలు తెలిపాయి.

Dil Raju: బిగ్ బ్రేకింగ్.. ఫిల్మ్ ఛాంబర్‌ ఎన్నికల్లో దిల్‌ రాజు గెలుపు

ఇక రామ్ చరణ్ సైతం ట్విట్టర్ ద్వారా శంకర్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ” భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నిజమైన గేమ్ ఛేంజర్ మీరే. చలన చిత్రపరిశ్రమలో 30 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శంకర్ షణ్ముఖ్ సర్ శుభాకాంక్షలు. మరెన్నో అద్భుతమైన పనులు, ప్రశంసలు మీకోసం ఎదురుచూస్తున్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి.. శంకర్ ఈ రెండు పాన్ ఇండియా సినిమాలతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.