ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అది అప్పుడు అలా జరుగుతుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ‘ఆర్.ఆర్.ఆర్.’ ఆరంభించినప్పుడు వెంటనే మరో మల్టీస్టారర్ లో నటిస్తానని తాను ఊహించలేదని చెప్పారు చెర్రీ. ‘ఆర్.ఆర్.ఆర్.’ అనుకున్న సమయానికి విడుదలయి ఉంటే అనుకుంటాం కానీ, ఏది మన చేతుల్లో ఉండదని అన్నీ అలా సమకూరినప్పుడే మంచి ప్రాజెక్ట్స్ మన సొంతమవుతాయని చెర్రీ తెలిపారు. అనుకోకుండా కేవలం రెండు నెలల వ్యవధిలో ‘ఆర్.ఆర్.ఆర్.’, ‘ఆచార్య’ వంటి మల్టీస్టారర్స్ రావడం, ఆ రెండు చిత్రాల్లో తాను నటించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
అన్నిటికీ ప్లాన్ వేసుకొని చేస్తే వర్కవుట్ కాదనీ చెర్రీ అన్నారు. గతంలో అలా ‘ఆరెంజ్’ సినిమాను ప్లానింగ్ ప్రకారమే రూపొందించామని చెప్పారు. నిజానికి ‘ఆరెంజ్’లో తన పాత్ర తనకెంతో సంతృప్తి నిచ్చిందని, కాకపోతే ఫలితం అనుకున్న స్థాయిలో దక్కలేదని ఆయన తెలిపారు. అందువల్ల కథను నమ్మి తన పాత్రలు ఎంపిక చేసుకుంటూ పోతానని ఆయన చెప్పారు. ప్రతీదానికీ ప్రణాళిక వేసుకోననీ ఆయన తేటతెల్లం చేశారు.
