Site icon NTV Telugu

Ram Charan: గాల్వాన్ అమరవీరుడి పిల్లలతో చరణ్ సెల్ఫీ

Ram Charan Selfies

Ram Charan Selfies

Ram Charan Takes Selfies With The Children Of The Martyred Indian Army officers: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ట్రూ జెంటిల్ మన్ అని మరోసారి నిరూపించుకున్నాడు. 2020లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో మరణించిన దివంగత కల్నల్ సంతోష్ బాబు పిల్లలతో రామ్ చరణ్ సెల్ఫీ దిగటమే అందుకు నిదర్శనం. ట్రూ లెజెండ్ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును అందుకున్న రామ్ చరణ్‌ దివంగత కల్నల్ సంతోష్ బాబు పిల్లలతో సెల్ఫీలు క్లిక్ చేయడం అభిమానులనే కాదు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాఫ్యాన్స్ ఈ క్లిప్ ను షేర్ చేస్తూ ‘నిజమైన లెజెండ్’ అని వ్యాఖ్యానించారు. ఈ క్లిప్‌లో రామ్ చరణ్ మొబైల్ ఫోన్‌ తీసుకొని పిల్లలతో పోర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో సెల్ఫీలు క్లిక్ చేయడం చూడవచ్చు. ఇక కొంతమంది అభిమానులైతే ‘జెంటిల్‌మన్’ అనేవారు. ఈ వేడుకలోనే రామ్ చరణ్ గాయని నేహా కక్కర్‌ను కలుసుని షేక్ హ్యాండ్ ఇవ్వడం, సోనూ సూద్‌ను కౌగిలించుకోవడం కూడా ఆకట్టుకుంది.

వర్క్ విషయానికి వస్తే రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ ను దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్నట్లు అధికారింగా ప్రకటించాడు. పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ తో కలసి నిర్మిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ దిల్ రాజు, శంకర్ చిత్రం షూటింగ్‌లో ఉన్నాడు.

https://twitter.com/MegaFamily_Fans/status/1600180911668334593?s=20&t=pKZiArTYSuj3lg2k7k0CQQ

Exit mobile version