Site icon NTV Telugu

ముంబైలో మెగా ఈవెంట్… ఉబెర్ కూల్ లుక్‌ లో రామ్ చరణ్

Ram-charan

“ఆర్ఆర్ఆర్” మెగా ఈవెంట్ కోసం రామ్ చరణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముంబై చేరుకున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్స్ లో చరణ్ లెదర్ జాకెట్‌ తో, సన్ గ్లాసెస్‌ ధరించి ఉబెర్ కూల్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ మెగా ప్రమోషనల్ ఈవెంట్ ముంబైలో జరగనుంది. దీని కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ దాదాపు 9 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్ ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో ప్రత్యేక అతిథిగా కనిపించనున్నారు. డిసెంబర్ 19న ఇక్కడే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

Read Also : బాక్స్ ఆఫీస్ పై “స్పైడర్ మ్యాన్” దాడి… బిగ్గెస్ట్ ఓపెనర్స్ లిస్ట్ లో స్థానం

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’లో ప్రధాన నటులు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ కీలక పాత్రల్లో కనిపించనుండగా, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడా ఉత్తర భారతదేశం అంతటా ఈ సినిమా థియేట్రికల్ పంపిణీ హక్కులను పొందారు. అన్ని భాషల కోసం ప్రపంచవ్యాప్త ఎలక్ట్రానిక్ హక్కులను కూడా ఆయనే కొనుగోలు చేశారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య నిర్మించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం 2022 జనవరి 7న విడుదల కానుంది.

Exit mobile version