Site icon NTV Telugu

Ram Charan: పిక్ ఆఫ్ ది డే.. ఖాన్స్ త్రయంతో గ్లోబల్ స్టార్ నాటు నాటు స్టెప్

Charan

Charan

Ram Charan: అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు అతిరథ మహారథులు హాజరయ్యారు. మార్క్ జూకర్ బర్గ్, బిల్ గేట్స్, ధోని, బాలీవుడ్ స్టార్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యాకారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్‌స్టోన్ సందడి చేశారు. ఇక టాలీవుడ్ నుంచి ఈ పెళ్లికి హాజరైన ఏకైక జంట రామ్ చరణ్ -ఉపాసన. అనంత్- రాధికా జంట కన్నా.. అందరి చూపు వీరిపైనే ఉండడం గమనార్హ.

ఇక ఈ పెళ్ళిలో బాలీవుడ్ ఖాన్స్ త్రయం డ్యాన్స్ హైలైట్ గానిలిచింది. ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్ కు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ డ్యాన్స్ వేశారు. ఇక చివర్లో రామ్ చరణ్ సైతం వారితో కాలు కదిపాడు. నాటు నాటు పాటకు త్రీ ఖాన్స్‌ వేసిన స్టెప్పులకు అతిథులు ఫిదా అయ్యారు. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు. ఇకపోతే అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం ఇదే ఏడాది జులైలో జరగనుంది.

Exit mobile version