మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కన్పించాడు. ఆ పిక్స్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” చివరి షెడ్యూల్ ని ఉక్రెయిన్ లో ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఈ రోజు ఉదయం ఆయన ఎయిర్ పోర్టులో కంపించడంతో కెమెరాలు క్లిక్ అన్నాయి. చరణ్ బ్లాక్ హూడీ, బ్లాక్ జీన్స్ ధరించి, మ్యాచింగ్ మాస్క్, టోపీ ధరించాడు. అయినప్పటికీ అభిమానులు ఆయనను గుర్తు పట్టేశారు. మిగతా “ఆర్ఆర్ఆర్” టీం కూడా హైదరాబాద్ కు చేరుకున్నట్టు సమాచార. ఎన్టీఆర్ నిన్ననే హైదరాబాద్ వచ్చాడు.
తారక్, చరణ్‌తో సహా ప్రధాన తారాగణంపై పాట చిత్రీకరణను పూర్తి చేయడానికి “ఆర్ఆర్ఆర్” బృందం ఉక్రెయిన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. బ్రిటిష్ పాలకుల రాయల్ బ్యాలెట్ ప్రదర్శనను అందించే కీలక సమయంలో ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు. బజ్ ప్రకారం ఈ పాట తర్వాత సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ ఉంటుంది. దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్ ఉక్రెయిన్‌లో 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని మొత్తానికి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. సినిమా పూర్తయిన సందర్భంగా రాజమౌళి అండ్ టీం కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. “ఆర్ఆర్ఆర్” బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి రాజమౌళి కొత్త షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నాడు. త్వరలో చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించి, “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తుందని అంటున్నారు.
Read Also : ఆగష్టు 22న మెగా అప్డేట్… అంతా రాజమౌళి చేతుల్లోనే ?
2021 అక్టోబర్ 13న సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ, కేరళ, మహారాష్ట్ర మొదలైన కొన్ని రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు మెరుగుపడలేదు. దీంతో అక్కడ థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. ఈ సినిమా విడుదల కావడానికి అది కూడా ఒక కారణం. అయితే చెప్పినట్టుగానే సినిమాను విడుదల చేస్తారా ? లేదా ? అనేది మాత్రం ఇంకా సస్పెన్సుగానే ఉంది.
ఇక డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు.
