Site icon NTV Telugu

Ram Charan: చరణ్ ఫాన్స్’కి బ్యాడ్ న్యూస్

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఇదొక మిశ్రమ వార్త అని చెప్పాలి, ఒకవైపు భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయని సంతోష పడాలో.. లేక అవి పట్టాలెక్కడానికి మరికొంత కాలం వేచి చూడాలని కంగారు పడాలో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం అందరి కళ్లు చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపైనే ఉన్నాయి, అయితే, ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో రాబోతున్న #RC17 గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, సుకుమార్ ఈ స్క్రిప్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం దర్శకుడు మరికొంత సమయం వెచ్చించనున్నారు. దీంతో #RC17 షూటింగ్ 2026 ద్వితీయార్థంలో, అంటే సుమారు జూలై నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Also Read: Ustaad Bhagat Singh : ఉగాది కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్.. సీన్ లోకి తమన్ ఎంట్రీ

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చరణ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారనేది ప్రధాన ఆకర్షణ, సుకుమార్ తన సినిమాల్లో హీరోల బాడీ లాంగ్వేజ్ నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేసేందుకు భారీ కసరత్తులే జరుగుతున్నాయట. ఒక రకంగా రామ్ చరణ్ ను మళ్ళీ తెర మీద చూడడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. షూటింగ్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో చరణ్ ఊరికే కూర్చోవడం లేదు. ఈ విరామంలో తన తదుపరి సినిమాలపై ఆయన దృష్టి సారించనున్నారు. పలువురు యువ దర్శకుల నుంచి ఆయన కథలు వింటున్నారు. బాలీవుడ్ ఎంట్రీ? చాలా కాలంగా చరణ్ కోసం ఒక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్యూలో ఉన్నారు. ఈ ఖాళీ సమయంలో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి, ‘పెద్ది’ తర్వాత చరణ్ నుంచి మరో మాస్ క్లాసిక్ చూడాలంటే అభిమానులు కాస్త ఓపిక పట్టక తప్పదు. కానీ, సుకుమార్ మార్క్ మేకింగ్‌తో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version