Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో భారీ సినిమా వస్తోంది. ప్రస్తుతానికి #RC16 వర్కింగ్ టైటిల్ గా పెట్టారు. మైత్రీ మూవీస్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే. సుకుమార్ రైటింగ్స్ కూడా ఇందులో భాగం అయింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఆర్సీ 16 నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. తాజాగా మూవీ నుంచి రామ్ చరణ్ ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ వెనక నుంచి కనిపిస్తున్నాడు. వెనకాల చేతిలో చుట్ట పట్టుకుని రగ్డ్ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు. గడ్డం, మీసాలు, చెదిరిన జుట్టుతో నాటుగా ఉన్నాడు.
Read Also : David Warner : రాబిన్ హుడ్.. నిముషానికి వార్నర్ అన్ని కోట్లు తీసుకున్నాడా..?
కాకపోతే ఇందులో రామ్ చరణ్ ఫేస్ కనిపించలేదు. ఈ పోస్టర్ లోనే అప్డేట్ ఇచ్చింది మూవీటీమ్. మార్చి 27 గురువారం అంటే రేపు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేస్తామని చెప్పింది. ఉదయం 9గంటల 9 నిముషాలకు ప్రకటిస్తామని తెలిపింది. ఫస్ట్ లుక్ లో చరణ్ ఇంకెంత రగ్డ్ గా కనిపిస్తాడో అని అంతా ఆశ్చర్యపోతున్నారు. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో చరణ్ చాలా నేచురల్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, ఆమని కీలక పాత్రలు చేస్తున్నారు. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రేపు విడుదలయ్యే లుక్ తో మూవీపై హైప్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.