మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా టైలో ఎన్టీఆర్ తో కలిసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన రామ్ చరణ్, తన నెక్స్ట్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని సోలోగానే టార్గెట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. చరణ్ బర్త్ డే రోజు అనౌన్స్ చేసిన ఈ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి లేదా సమ్మర్ ని టార్గెట్ చేస్తూ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ పార్ట్ వీలైనంత త్వరగా పూర్తి చెయ్యడానికి చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ షూటింగ్ ని కంప్లీట్ చేసి సెప్టెంబర్ నుంచి ‘RC 16’ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లేలా చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో రామ్ చరణ్ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయిపొయింది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
విలేజ్ లో జరిగే ఒక చిన్న కథని పెద్దగా చెప్దాం అంటూ దర్శకుడు బుచ్చిబాబు RC 16పై అనౌన్స్మెంట్ తోనే అంచనాలని పెంచేసాడు. లేటెస్ట్ గా RC 16 గురించి సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ ఫైనల్ అయ్యాడని, ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ లేదు కానీ ఇది నిజమైతే మాత్రం రెహమాన్ ట్యూన్స్ కి రామ్ చరణ్ డాన్స్ ఊహించుకోవడానికే గ్రాండ్ గా ఉంది. మరి RC 16 కోసం మేకర్స్ నిజంగానే రెహమాన్ ని ఫైనల్ చేశారా లేదా అనేది చూడాలి. నిజానికి బుచ్చిబాబు ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాని ఎన్టీఆర్ తో చెయ్యాల్సి ఉంది. ఎన్టీఆర్ తో వర్క్ చెయ్యడానికి బుచ్చిబాబు చాలా రోజులే వెయిట్ చేశాడు కానీ కొరటాల శివ సినిమా డిలే అవుతూనే ఉండడంతో బుచ్చిబాబు చరణ్ కి షిఫ్ట్ అయ్యాడు.
