Site icon NTV Telugu

Ram Charan : అంబానీ ఇంట పెళ్లి వేడుక లో రామ్ చరణ్, ఉపానస సందడి..

Ram Charan (4)

Ram Charan (4)

ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్నకొడుకు అనంత్ అంబానీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి.. ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.. ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకొని సందడి చేస్తున్నారు.. టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు.. రామ్ చరణ్, ఉపాసన దంపతులు అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ కు హాజరయ్యారు.. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

అనంత్ -రాధిక ప్రీ వెడ్డింగ్ గ్లోబల్ వైడ్ వైరల్ అవుతుంది. ఈ వేడుకకు టాలీవుడ్ లో రామ్ చరణ్ కి ఆహ్వానం అందింది. దీంతో నేడు చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఈవెంట్ వేదిక లోపలికి వెళ్లేముందు మీడియాకు చరణ్ – ఉపాసన పోజులు ఇస్తుండగా అక్కడ మీడియా, అభిమానులు చరణ్ ని చూసిన ఆనందంతో జై శ్రీరామ్ అని నినాదాలు

గత నెల 28 నుంచి ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ ఈవెంట్ కి వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహన్న, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ వంటి ఇంటర్నేషనల్ పర్సన్స్ అతిథులుగా రావడంతో.. ఈ ప్రీ వెడ్డింగ్ గ్లోబల్ వైడ్ వైరల్ అవుతుంది.. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి ఇండియాలోని టాప్ స్టార్స్ కి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ స్టార్స్ ఈ సెలబ్రేషన్స్ కి గెస్ట్‌లుగా హాజరవుతున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన ఫ్యామిలీతో సహా కలిసి ఇప్పటికే జామ్ నగర్ కు చేరుకున్నారు. ఈ మ్యూజికల్ కాన్సర్ట్ పూర్తి అయిన తరువాత రోజు అతిథులతో జంగల్ సఫారీ ఈవెంట్ ఉండబోతుంది. ఆ నెక్స్ట్ డే జామ్‌నగర్ ప్రకృతి అందాలను అతిథులకు చూపించనున్నారు..

Exit mobile version