Site icon NTV Telugu

RamCharan : హిట్-3 అదిరిపోయింది.. నానికి రామ్ చరణ్‌ స్పెషల్ విషెస్..

Ram Charan

Ram Charan

RamCharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ తాజాగా హీరో నానికి స్పెషల్ విషెస్ చెప్పారు. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. ఈ మూవీకి హిట్ టాక్ వస్తుండటంతో తాజాగా రామ్ చరణ్‌ స్పెషల్ ట్వీట్ చేశాడు. హిట్-3కి రివ్యూస్ ఫెంటాస్టిక్ గా వస్తున్నాయని.. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు అదిరిపోయింది అంటూ రామ్ చరణ్‌ రాసుకొచ్చాడు. నాని ఎంచుకుంటున్న కథలు బాగుంటున్నాయని.. ఇలాగే ముందుకు వెళ్లాలంటూ కోరాడు. శైలేష్ కొలను హిట్-3కి రాసుకున్న స్క్రిప్ట్, విజువల్స్, తెరకెక్కించిన విధానానికి హ్యాట్సాఫ్‌ అంటూ తెలిపాడు.
Read Also : Ivana : శ్రీ విష్ణు తెలుగు చాలా స్పీడ్.. అర్థమయ్యేది కాదు.. అలవాటైపోయా!

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన హిట్-3 హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. రెండు రోజుల్లోనే రూ.62 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఈ వీక్ లో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైమ్ ఇందులో నాని రస్టిక్ పాత్రలో వైలెన్స్ సృష్టించేశాడు. నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ సినిమా చేయబోతున్నాడు. అది త్వరలోనే స్టార్ట్ కాబోతోంది.
Read Also : Sreeleela : అంతా తూచ్.. ఆ ఫొటోలో పాప ఎవరో చెప్పేసిన శ్రీలీల..

Exit mobile version