RRR సూపర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు శంకర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా RC15 అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతోంది. లొకేషన్ నుండి చెర్రీ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పంజాబీ పోలీసులు చెర్రీతో కలిసి ఫోజులిచ్చారు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు చెర్రీ క్రేజ్ కేజ్రీగా పెరిగిపోయిందని, పంజాబ్ లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడిందని అంటున్నారు. ఇటీవలే అమృత్ సర్ లో కూడా చెర్రీతో సెల్ఫీలు తీసుకోవడానికి జనాలు ఎగబడిన విషయం తెలిసిందే.
Read Also : KGF 2 : ఓటిటిలో ఎప్పుడంటే ?
కాగా RC15 షూటింగ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కథను కార్తీక్ సుబ్బరాజ్ రాయగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.