మహేశ్ బాబు ఫాన్స్ కి ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ‘జల్సా’, ప్రభాస్ ఫాన్స్ కి ‘బిల్లా’, బాలయ్య ఫాన్స్ కి ‘చెన్నకేశవ రెడ్డి’, ఎన్టీఆర్ ఫాన్స్ కి ‘బాద్షా’… ఇలా ప్రతి హీరో ఫ్యాన్ బేస్ ఈ మధ్య ఈరిలీజ్ ట్రెండ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఫాన్స్ కి ఈ ట్రెండ్ లో జాయిన్ అయ్యే టైం దగ్గరలోనే ఉంది. కమర్షియల్ సినిమాలు ఎక్కువగా చేసే చరణ్, కెరీర్ స్టార్టింగ్ లోనే లవ్ స్టొరీ మూవీ ‘ఆరెంజ్’. ఈ మూవీ రిలీజ్ సమయంలో థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యింది కానీ కొన్ని సంవత్సరాలు గడిచాకా ‘ఆరెంజ్’ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. ఆరెంజ్ మూవీ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే సూపర్ హిట్ అయ్యేది, ట్రెండ్ సెట్టర్ అయ్యేది అనే మాటలు వినీ వినీ ప్రొడ్యూసర్ నాగబాబు ‘ఆరెంజ్’ సినిమాని మళ్లీ థియేటర్స్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా నాగబాబు స్వయంగా అనౌన్స్ చేశాడు.
‘ఆరెంజ్’ సినిమా రిలీజ్ అయ్యి 12 సంవత్సరాలు అవ్వడంతో, ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ట్విట్టర్ లో ‘ఆరెంజ్’ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉండడంతో… “పర్ఫెక్ట్ రిలీజ్ టైం చూసుకోని ‘ఆరెంజ్’ సినిమాని రిలీజ్ చేస్తాను” అని నాగబాబు చెప్పడంతో, ,మెగా అభిమానులంతా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయమని సలహా ఇస్తున్నారు. వాలెంటైన్స్ డే సంధర్భంగా ఒక మంచి ప్రేమకథ ఉన్న సినిమా థియేటర్స్ లో పడితే, యూత్ అంతా ఆరోజు సినిమా చూడడానికి వెళ్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ ఉండడం, చరణ్ మార్కెట్ కూడా పెరగడం, కల్ట్ లవ్ స్టొరీ అనే భావన సినీ అభిమానుల్లో కూడా పెరగడం… ఇలా అనేక కారణాలని కన్సిడర్ చేశాక నాగబాబు ‘ఆరెంజ్’ సినిమాని రీరిలీజ్ డిసైడ్ అయినట్లు ఉన్నాడు.
చిరుత సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్, అతి తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా తనకంటూ సెపరేట్ ఫాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC 15 అనే సినిమా చేస్తున్నాడు. ‘వింటేజ్ శంకర్’ లైన్స్ లో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో స్టార్ట్ అయ్యింది. కియారా అద్వానీ, చరణ్ పై ఇక్కడో సాంగ్ ని పది రోజుల పాటు షూట్ చేయనున్నారు. న్యూజిలాండ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక, తిరిగి వైజాగ్ లో RC 15 కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు.