Site icon NTV Telugu

Orange: రామ్ చరణ్ సినిమా బుకింగ్ ఓపెన్ అయ్యాయి…

Ram Charan

Ram Charan

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చిన హీరో ‘రామ్ చరణ్ తేజ్’. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, అతి తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు చరణ్. రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన చరణ్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ ఆడియన్స్ ముందుకి వెళ్లిన చరణ్ నటించిన మూడో సినిమా ‘ఆరెంజ్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో భారి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది ఆరెంజ్ సినిమా. నాగబాబు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ టాలీవుడ్ హిస్టరీ లోనే బెస్ట్ సాంగ్స్ ఉన్న సినిమాగా పేరు తెచ్చుకుంది. రిలీజ్ కి ముందే సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చెయ్యడంతో ఆరెంజ్ సినిమా చూడడానికి యూత్ అంతా థియేటర్స్ కి వచ్చారు. రామ్ చరణ్ లుక్, డ్రెస్సింగ్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలో కొత్తగా కనిపించాడు. సినిమా మొత్తం ఆస్ట్రేలియాలో షూట్ చెయ్యడంతో ఆరెంజ్ సినిమా ఆన్ స్క్రీన్ బ్యూటీ ప్రతి ఫ్రేమ్ లో ఉంటుంది. హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. చరణ్ ఖాతాలో ఫస్ట్ ఫ్లాప్ చేరింది.

మూడో సినిమాకే భారి నష్టాలని ఇచ్చాడు కానీ అతని స్టొరీ సెలక్షన్స్ రాంగ్ కాదు అని ప్రూవ్ చేస్తూ ఆరెంజ్ సినిమా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంది. ఒక కల్ట్ లవ్ స్టొరీగా, ప్రేమ కొంతకాలమే బాగుంటుంది అని చెప్పిన గొప్ప ప్రేమకథగా ఆరెంజ్ సినిమా టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయింది. ఈ సినిమా రాంగ్ టైంలో రిలీజ్ అయ్యింది, ఇప్పుడు రీరిలీజ్ చెయ్యండి అంటూ మెగా అభిమానులు అడుగుతూనే ఉంటారు కానీ నాగబాబు మాత్రం ముందుకి రాలేదు. ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత మెగా అభిమానుల కోసం ఆరెంజ్ సినిమా రీరిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. మార్చ్ 25, 26 తేదీల్లో ఆరెంజ్ సినిమా స్పెషల్ షో చెన్నై, బెంగుళూరు, తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ వెయ్యనున్నారు. ఈ షోస్ కి సంబంధించిన ఆన్ లైన్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆరెంజ్ సినిమా స్పెషల్ షోస్ కి వచ్చిన డబ్బులని జనసేన పార్టీకి డొనేట్ చెయ్యడానికి నాగబాబు రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోని మెగా అభిమానులు ఆరెంజ్ సినిమాని చూడడానికి హ్యుజ్ నంబర్స్ లో వెళ్లే ఛాన్స్ ఉంది.

Exit mobile version