NTV Telugu Site icon

Ram Charan: ఆ కల్ట్ సినిమాకి 12 ఏళ్లు…

Fidc8jwamaefwil

Fidc8jwamaefwil

కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమయ్యి, కాలక్రమేనా కొన్నేళ్ల తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంటూ ఉంటాయి. ఈ కేటగిరిలో చాలా సినిమాలే ఉన్నాయి కానీ అన్నింటికన్నా ఎక్కువగా చెప్పుకోవాల్సింది మాత్రం ‘ఆరెంజ్’ సినిమా గురించే. ‘మగధీర’ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో రామ్ చరణ్ మూడో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉండేవి. మాస్ సినిమా చేసి ఆ అంచనాలు అందుకుంటాడు అనుకుంటే చరణ్, తన మూడో సినిమాగా ‘బొమ్మరిల్లు భాస్కర్’ దర్శకత్వంలో ‘ఆరెంజ్’ సినిమాని అనౌన్స్ చేయడమే అందరినీ ఆశ్చర్యపరిచింది.

‘ఆరెంజ్’ సినిమా ప్యూర్ లవ్ స్టొరీగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీలో చరణ్ ‘ప్రేమ కొంత కాలమే బాగుంటుందని’ చెప్పిన డైలాగ్ ని నిజం చేస్తూ ఇప్పటికీ ఎన్నో ప్రేమకథలు మన రెగ్యులర్ లైఫ్ లో కనిపిస్తూ ఉంటాయి. ఆరెంజ్ సినిమా రిలీజ్ అయిన టైం  తప్పో లేక మాస్ హీరో నుంచి క్లాస్ సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదో తెలియదు కానీ థియేటర్స్ లో ఆరెంజ్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయ్యింది అనే మాటే కానీ ఈ మూవీలో చరణ్ లుక్స్ కి మంచి పేరొచ్చింది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే తెలుగులో సూపర్ హిట్ అయిన ఆల్బమ్స్ లో ‘ఆరెంజ్’ సినిమా ఒకటి. ఈ మూవీలోని అన్ని పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 2010 నవంబర్ 26న రిలీజ్ అయ్యింది. గత పుష్కర కాలంలో కల్ట్ లవ్ స్టొరీ  సినిమా అనే టాపిక్ వచ్చిన ప్రతిసారీ ‘ఆరెంజ్’ సినిమా పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యి నేటికి 12 ఏళ్లు కావడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.