Site icon NTV Telugu

‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్: రౌద్రుడిగా ‘రామ్’ అరాచకం

ram charan

ram charan

ప్రపంచవ్యాప్తంగా సినీఅభిమానులు అందరు ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రంతి కానుకగా జనవరి 7 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే జక్కన్న ప్రమోషన్స్ వేగవంతం చేసేశాడు . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు రికార్డుల మోతను మోగిస్తున్నాయి. ఇక తాజాగా నేడు ‘ఆర్ఆర్ఆర్’ బృందమే అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల న్యూ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. చెప్పినట్లుగానే ఉదయం కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ పోస్టర్ ని రిలీజ్ చేయగా.. తాజాగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో చరణ్ రౌద్ర రూపంలో కనిపించాడు .. రణరంగంలో భీకర యుద్ధాల మధ్య రామరాజు గంభీరంగా అరుస్తూ కనిపించాడు.. ఇక చెర్రీ బాడీ లుక్ చూస్తుంటే ఈ పాత్రకోసం ఎంత కష్టపడ్డాడో అర్ధమవుతుంది.. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్ర ట్రైలర్ మరో మూడు రోజుల్లో రానుంది.. మరి పోస్టర్లతోనే అరాచకం చూపిస్తున్న జక్కన ట్రైలర్ లో ఇంకెంత పూనకాలు తెప్పిస్తాడో చూడాలి.

Exit mobile version