మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూట్లోనే వెళ్లబోతున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ట్రిపుల్ ఆర్‌తో పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్న చరణ్.. ఇప్పుడు అందుకు తగ్గట్టే భారీగా బాలీవుడ్ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఇంతకీ చెర్రీ టార్గెట్ ఏంటి.. ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాడు..!
బాహుబలితో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ప్రభాస్.. ఆ తర్వాత కూడా ఆ స్థాయిలోనే సినిమాలు చేస్తున్నాడు. అయితే సాహో, రాధే శ్యామ్ సినిమాలు బాహుబలి టైంలో కమిట్ అయ్యాడు కాబట్టి.. ప్రభాస్ ఇమేజ్‌ను కాస్త డ్యామేజ్ చేశాయి. కానీ ఆ తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టడంతో.. ఆదిపురుష్ సినిమాకు కమిట్ అయ్యాడు డార్లింగ్. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్‌తో వచ్చిన స్టార్‌డమ్‌ను కాపాడుకునేందుకు భారీగానే కసరత్తులు చేస్తున్నాడట. ప్రస్తుతం శంకర్‌తో ఓ సినిమా చేస్తున్న చరణ్.. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్నాయి. అయితే ఆ తర్వాత ఓ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడట చరణ్. అది కూడా కమర్షియల్‌గా కాకుండా.. చారిత్రాత్మక మూవీకి రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ రచయిత అమిష్ త్రిపాఠి రాసిన ‘లెజెండ్ ఆఫ్ సుహేల్ దేవ్.. ది కింగ్ హు సేవ్డ్ ఇండియా’ పుస్తకం ఆధారంగా.. ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో రాజా సుహెల్ దేవ్‌గా చరణ్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాక.. ప్రభాస్ మైథలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌తో చరణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు. దాంతో ఇద్దరు కూడా బాలీవుడ్ కోసం వైవిధ్యంగా ముందుకు సాగుతున్నారనడంలో సందేహం లేదు. అయితే చరణ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పుడు మన హీరోల ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉందని చెప్పాలి.
