మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి మొట్టమొదటిసారిగా చేస్తున్న చిత్రం “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23న “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు రాజమౌళి అతిథిగా హాజరు కాగా, చిరు, చరణ్, కొరటాలతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు. అయితే ఇందులో భాగంగా రామ్ చరణ్ వేదికపై మాట్లాడుతుండగా హఠాత్తుగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ఓ అభిమాని చెర్రీ కాళ్లపై పడ్డాడు. బాడీగార్డ్స్ అతన్ని పక్కకు నెడుతుండగా, చెర్రీ వాళ్ళను ఆపి అభిమానిని అడిగిన డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Read Also : Acharya : చిరు, చెర్రీ రెమ్యూనరేషన్ తీసుకోలేదా?
కాళ్లపై పడ్డ అభిమానిని లేపిన చెర్రీ “నిన్ను ఎవరు డిజైన్ చేసి పంపించారు ?” అని ప్రశ్నించాడు. ఆ తరువాత అతనితో సెల్ఫీ దిగి, పంపేశాడు. అయితే చెర్రీ అడిగిన ప్రశ్న ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిచ్చింది. గతంలో కూడా పలు ఈవెంట్లలో ఇలాంటి సందర్భాలే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈవెంట్లలో ఇలా కావాలనే ప్లాన్ చేస్తున్నారా? లేక చరణ్ ఇంకా ఎవరి మీదన్నా సెటైర్లు వేశాడా? అంటున్నారు నెటిజన్లు.