Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోస్ట్ వయొలెంట్ అండ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. సరికొత్త మేకోవర్‌తో, మట్టిలో దొర్లుతూ ఆయన కనిపిస్తున్న తీరు చూస్తుంటేనే.. వెండితెర మీద ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడో అర్థమవుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ మణికట్టుకు తీవ్ర గాయమైంది. ఈ మేరకు వీడియోలలో చూసిన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఆ గాయం ఎలా జరిగింది? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అనే దానిపై తాజాగా మెగా పవర్ స్టార్ స్వయంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లు అంటే సాధారణంగా డూప్‌లను వాడటం లేదా ట్రెయిన్డ్ ఫైటర్స్‌తో జాగ్రత్తగా షూట్ చేయడం చూస్తుంటాం. రామ్ చరణ్ కూడా దర్శకుడు బుచ్చిబాబు సనాకు ముందుగా ఇదే సలహా ఇచ్చారట.
“యాక్షన్ ఎపిసోడ్స్ తీసేటప్పుడు ఎవరైనా ట్రెయిన్డ్ ఆర్టిస్టులను కానీ, ప్రొఫెషనల్ ఫైటర్లను కానీ పెట్టుకుందాం.. ఫైట్స్ సేఫ్‌గా వస్తాయి” అని చరణ్ ముందే చెప్పారట. కానీ, మన డైరెక్టర్ మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఆలోచించాడు. సినిమాలో ఎక్కడా ఆర్టిఫిషియల్ ఫీల్ రాకూడదని, ప్రతి సీన్ వంద శాతం న్యాచురల్‌గా ఉండాలని బుచ్చిబాబు గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. దీంతో ఏకంగా ఏరికోరి మరీ ‘నిజమైన పహిల్వాన్లను’ రంగంలోకి దించాడు. కెమెరా ముందు కేవలం నటిస్తున్నట్లు కాకుండా, నిజంగానే ప్రాణాలు పణంగా పెట్టి కుస్తీ పడుతున్నట్లు ఆ సీన్స్ డిజైన్ చేశారు. ఏమాత్రం సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని ఆ కండల వీరులతో, రియల్ టైమ్ కుస్తీ ఫైట్స్ చేయడం వల్లే రామ్ చరణ్ మణికట్టుకు బలమైన గాయమైంది. “సినిమాలో ఆ న్యాచురాలిటీ ఎక్కడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో బుచ్చిబాబు రియల్ పహిల్వాన్లనే తీసుకొచ్చాడు.. వారితో హోరాహోరీగా తలపడటం వల్లే నా చేతికి అలా గాయమైంది” అంటూ చరణ్ స్వయంగా ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!