మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఎప్పుడు బయటకి వస్తుంది అంటే సమాధానం తెలియదు, గ్లిమ్ప్స్ బయటకి వస్తుందా అంటే అది దిల్ రాజుకి కూడా తెలియదు. పోనీ కనీసం గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అయినా చెప్పండి అంటే దానికి సమాధానం డైరెక్టర్ శంకర్ కైనా సమాధానం తెలుసో లేదో చూడాలి. ఒక స్టార్ హీరో చేస్తున్న పాన్ ఇండియా సినిమా విషయంలో ఇలా జరగడం అభిమానులని అప్సెట్ చేసే విషయమే. రీసెంట్ గా సాంగ్ రిలీజ్ అనుకున్నారు కానీ అది కూడా కాకపోవడంతో “మాట తప్పుతున్నావ్ అన్న” అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
రామ్ చరణ్ తేజ్ ఏడాది ఒక సినిమాని తప్పకుండా రిలీజ్ చేస్తాను అంటూ ఫ్యాన్స్ కి మాటిచ్చాడు. ఇది ఇప్పుడు గేమ్ ఛేంజర్ కారణంగా అవ్వట్లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఏడాదికో సినిమా చేస్తానని చెప్పిన చరణ్, ఆచార్య సినిమాని 2022లోనే రిలీజ్ చేసాడు. ఏప్రిల్ 2022 నుంచి ఇప్పటివరకూ చరణ్ నుంచి సినిమా రిలీజ్ కాలేదు. ఏడాదిన్నర అయ్యింది కానీ గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటికీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు గేమ్ ఛేంజర్ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ తర్వాతే రిలీజ్ కానుంది. మరి ఈ రెండేళ్ల రామ్ చరణ్ టైమ్ కి వర్త్ అనిపించే హిట్ ని శంకర్ ఇస్తాడో లేదో చూడాలి.
