Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలతో ట్విట్టర్ మోత మ్రోగిపోతోంది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం చరణ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇంకోపక్క చరణ్ నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి కొత్త పోస్టర్లను రిలీజ్ చేసి చరణ్ కు బర్త్ డే ట్రీట్ అందిస్తున్నారు. ఇక చరణ్ పుట్టినరోజున అభిమానులకు మాత్రం పండగే పండుగ అని చెప్పాలి. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తుండగా శ్రీకాంత్, జయరాం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Vishnu Vishal: భార్యకు విష్ణు విడాకులు.. ? అసలేమైంది..?
ఇక నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను పోస్టర్ ను రిలీజ్ చేసి పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్. పోస్టర్ లో చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు. స్టైలిష్ బైక్ పై చెదిరిన జుట్టు, గాగుల్స్ పెట్టుకొని వెనక్కి తిరిగి ఇచ్చిన పోజ్ అయితే ఆకట్టుకుంటుంది. అయితే ఈ పోస్టర్ చూడగానే అభిమానులు చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాను గుర్తుతెచ్చుకుంటున్నారు. అందులో కూడా సేమ్ ఇదే లుక్ తో కనిపిస్తాడు చరణ్. దీంతో ఎవరిని మోసం చేస్తున్నారు.. బ్రూస్ లీ పోస్టర్ వేసి కొత్త పోస్టర్ అంటారేంటి అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో చరణ్ తన గేమ్ ను ఎలా మొదలుపెడతాడో చూడాలి.