Site icon NTV Telugu

Ram Charan: కారును వెంబడించిన అభిమానులు.. షాకిచ్చిన రామ్ చరణ్

Ram Charan

Ram Charan

Ram Charan fans Follwed his car: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ శివారులోని ఇస్నాపూర్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక షూటింగ్ లో రామ్ చరణ్ తేజ పాల్గొంటున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు షూటింగ్ ముగించుకుని వస్తున్న రాంచరణ్ కారును వెంబడించారు. ఆయనతో పాటు ప్రయాణిస్తూ కొంత దూరం వెంబడించిన నేపథ్యంలో కారును స్లో చేయించిన రామ్ చరణ్ తేజ వారందరికీ అభివాదం చేసి దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అయితే తాము వెళుతుంటే మరింత స్పీడ్ పెంచి రామ్ చరణ్ కారు ముందుకు తీసుకువెళతారు అనుకుంటే కారు స్లో చేయించి తమను పలకరించడంతో అభిమానుల షాక్ అయ్యారు. ఇక ప్రస్తుతానికి రామ్ చరణ్ శంకర్ ల గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Vijay Devarakonda: రష్మికతో ఎంగేజ్ మెంట్.. గుట్టువిప్పిన రౌడీ హీరో

నిజానికి ఈ సినిమాని ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు. అయితే మధ్యలో ఇండియన్ 2 షూటింగ్ కూడా శంకర్ చేయాల్సి రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. సెప్టెంబర్ నెలలో ఈ సినిమాని విడుదల చేయాలని ప్రస్తుతానికి డెడ్ లైన్ గా పెట్టుకుని సినిమా యూనిట్ కష్టపడుతోంది. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రకు అంజలిని హీరోయిన్గా మరొక పాత్రకు కియార అద్వానీ హీరోయిన్ అనే విషయం కొంత క్లారిటీ వచ్చేసింది. ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కాస్త భారతీయుడు టచ్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

Exit mobile version