NTV Telugu Site icon

Ram Charan: రామ్ చరణ్ ధరించిన షర్ట్ రేటు అన్ని వేలా? వామ్మో!

Ram Charan Shirt

Ram Charan Shirt

Ram Charan Dior Shirt Cost goes Viral: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోగా నిలదొక్కుకున్న రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అందరి అభినందనలు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. తన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్టు కొట్టిన రామ్ చరణ్ తేజ్… ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ వల్ల గ్లోబల్ స్టార్ అయిపోయారు. ప్రస్తుతానికి రామ్ చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు, బుచ్చిబాబు దర్శకత్వంలో తన RC16వ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు పెద్ది అనే పేరు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యనే రామ్ చరణ్ కి ఒక అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే.

Supreme Court: మూక హత్యలను అరికట్టేందుకు ఏం చేశారు..? రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు

రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా అందించింది యూనివర్సిటీ యాజమాన్యం. అయితే ఈ డాక్టరేట్ అందుకునేందుకు గాను ఆయన తన భార్య, పాప క్లింకారా అలాగే పెంపుడు కుక్క రైమ్ తో కలిసి స్పెషల్ ఫ్లైట్లో చెన్నై వెళ్లారు. ఇక చెన్నైలో దిగిన తర్వాత అక్కడి ఎయిర్ పోర్ట్ లోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ ధరించిన షర్టు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఆయన షర్టు ఏమిటి? అని ఢీకొట్ చేసే పనిలో కూడా కొన్ని సోషల్ మీడియా పేజెస్ కూడా పడ్డాయి. అందులో ఒక పేజీ ఆ షర్ట్ కంపెనీ డిఆర్. ఆ షర్టు ద్వారా దాదాపు రూ.63 వేల చిల్లర ఉంటుందని తేల్చింది. మరి ఇంకెందుకు మీరూ ఒక లుక్ వేయండి.