NTV Telugu Site icon

Ram Charan: వరద బాధితులకు రామ్ చరణ్ భూరి విరాళం

Ramcharan

Ramcharan

Ram Charan Announces 1 Crore for Ap and Telangana CM Relief Funds: తెలుగు రాష్ట్రాల వరదల నేపథ్యంలో ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రముఖులు తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి హీరోలు తమ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అనౌన్స్ చేయగా ఇప్పుడు ఈ లిస్టులో మరో హీరో చేరారు. ఆయన మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ.

Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’ నష్టాలు.. హరీష్ కీలక నిర్ణయం!

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తాను వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి మరో 50 లక్షలు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అని అంటూ ఆయన రాసుకొచ్చారు.

Show comments