NTV Telugu Site icon

RC16: రామ్ చరణ్‌తో ‘ఉప్పెన’ దర్శకుడి సినిమా

Ram Charan Buchi Babu

Ram Charan Buchi Babu

Ram Charan Announced His Next Film With Buchi Babu Sana: వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీస్‌లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ‘ఉప్పెన’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2021లో విడుదలైన ఈ సినిమాలో కీర్తి శెట్టి హీరోయిన్ కాగా విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషించారు. ఆ సినిమా విజయం తర్వాత బుచ్చిబాబు పలువురు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నాడంటూ న్యూస్ వినిపిస్తూ వచ్చింది. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్‌‌ను తన రెండో సినిమాగా డైరెక్ట్ చేయబోతున్నాడు బుబ్చిబాబు సానా. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు వెంకట సతీశ్‌తో కలిసి మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించబోతున్నాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. హీరోయిన్, షూటింగ్ ఎప్పటి నుంచి అనేది త్వరలోనే ప్రకటించనున్నారు.