మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి కొత్తగా పెళ్ళైన జంటను స్వాగతించారు. ఉపాసన సోదరి అనుష్పల తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంను కుటుంబం సమక్షంలో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త జంటతో కలిసి ఉన్న ఫోటోలను, సరదా మూమెంట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఉపాసన. రెండు రోజుల క్రితం దోమకొండ కోటలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.
Read Also : “శ్యామ్ సింగ రాయ్” సస్పెన్స్ కు తెర దించిన దర్శకుడు
ఫోటోలలో చరణ్, అర్మాన్ ఒకరికొకరు సంతోషకరమైన చిరునవ్వులు చిందిస్తూ క్లోజప్ షాట్‌లో కనిపించారు. ఇద్దరు జంటలు… చరణ్, ఉపాసన, అర్మాన్, అనుష్పల సెల్ఫీలు కూడా తీసుకున్నారు. వివాహానంతర పార్టీని వీరంతా కలిసి చేసుకున్నారు. అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ అనుష్పల, కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీం ఇద్దరూ కొన్నేళ్లు ప్రేమలో మునిగి తేలి ఇప్ప్పుడు వివాహం చేసుకున్నారు.