ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచరస్ మూవీ “కొండపోలం”. పంజా వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఆయనకు రెండవ చిత్రం. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె విలేజ్ గర్ల్ గా కనిపించనుంది. తాజాగా రకుల్ పాత్రను పరిచయం చేస్తూ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సినిమాలో రకుల్ ఓబులమ్మ అనే పాత్రను పోషిస్తుంది. ఫస్ట్ లుక్ లో ఆమె డి-గ్లామ్లర్ లుక్ లో ఉంది. “కొండపొలం” మేకర్స్ మరో పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో హీరో వైష్ణవ్ తేజ్ అడవిలో రకుల్ ప్రీత్‌ను ఆప్యాయంగా కౌగిలించుకోవడం కనిపిస్తుంది.
Read Also : “మా” ఎన్నికలకు ముహూర్తం ఖరారయ్యిందా ?
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా “కొండపొలం” నిర్మిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 8న థియేటర్‌లో విడుదల కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రాసిన నవల ఆధారంగా “కొండపొలం” తెరకెక్కిస్తున్నారు. ఇందులో నుంచి వైష్ణవ్ తేజ్ లుక్ ను గత శుక్రవారం విడుదల చేశారు.
