Site icon NTV Telugu

వెబ్ సిరీస్ తో నవ్వించబోతున్న రకుల్!

Rakul preet singh’s contagious smile

రకుల్ ప్రీత్ సింగ్ మరో కొత్త అడుగు వేయబోతోందా? ఆమె తాజా ట్వీట్ చూస్తే అదే అనిపిస్తోంది. నేరుగా ప్రకటించకపోయినా హింట్ అయితే ఇచ్చింది హాట్ గాళ్! “కడుపు నొప్పెట్టేదాకా నవ్వండి. ఆ తరువాత, మరి కాస్త నవ్వండి!” అంటోంది రకుల్. తన సొషల్ మీడియా అకౌంట్లో తాజాగా ఓ లాఫ్ మెసేజ్ పోస్ట్ చేసిన ఈ లవ్లీ లేడీ బ్యూటిఫుల్ పిక్ కూడా బోనస్ గా అందించింది.

Read Also : మహేష్ బర్త్ డే విష్… ఫ్యాన్స్ చేసి తీరాల్సిందే !

ముత్యాలు జారిపడేలా నవ్వుతూ ఫోజిచ్చిన ఆమె ‘సిరీస్ కమింగ్ సూన్’ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసింది. ఇంతకీ దీనర్థం ఏంటి? రకుల్ త్వరలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే వెబ్ సిరీస్ లో నటించనుందా? ‘అంతే’నంటున్నారు చాలా మంది! కాజల్, తమన్నా, సమంత లాంటి చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికే వెబ్ ఎంట్రీ ఇచ్చేశారు. మరి వారి బాటలోనే రకుల్ నడవటంలో ఆశ్చర్యమైతే లేదు. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్నదే ప్రస్తుతానికి ఉత్కంఠ…

Exit mobile version