Site icon NTV Telugu

Rakul Preet Singh: ఎంత చూపించినా ఏమి లేదక్కడ..

Rakul

Rakul

Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. చక్కని అందం, అభినయంతో త్వరగానే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. ఇక ఆ తరువాతబాలీవూడ్ కు పయనమయ్యింది. బాలీవుడ్ కోసం జీరో సైజ్ కు వచ్చింది. నిత్యం జిమ్ చేస్తూ.. ఎంతో ముద్దుగా ఉండే ఈ భామ బక్కచిక్కి బాగా పలుచగా తయారయ్యింది. ఒకానొక సమయంలో ఆ రకుల్, ఈ రకుల్ ఒకటేనా అని అభిమానులకు అనుమానం వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. ఆ మునుపటి రూపం తో పాటు అమ్మడు అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. ఇక బాలీవుడ్ లోనే రకుల్ ఒక మంచి ప్రేమికుడును కూడా వెతుక్కుంది. త్వరలోనే ప్రేమించినవాడిని పెళ్లాడనుంది రకుల్. ఇక్కడివరకు బాగానే ఉన్నా .. ప్రస్తుతం రకుల్ చేతిలో అన్ని సినిమాలు లేవు. ముఖ్యంగా తెలుగు సినిమాలు అయితే అస్సలు లేవు.

Men In Black: బ్లాక్ డ్రెస్ లో స్టార్ హీరోలు.. ఏ రేంజ్ లో ఉన్నారో మీరే చెప్పండి

రకుల్ చేతిలో ఉన్న పాన్ ఇండియా సినిమా ఇండియన్ 2 మాత్రమే. ఆ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసి కూర్చోంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో విరుచుకుపడుతుంది. అందాల ఆరబోతకు ఎక్కడా తగ్గకుండా ఎద అందాలను, థైస్ అందాలను చూపిస్తూ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే మునుపటి రూపం, కళ లేకపోవడంతో రకుల్ ను అభిమానులు అంతగా పట్టించుకోవడం లేదు. కేజీ కండ కూడా లేదు.. ఎంత చూపించినా ఆ కళ ముఖంలో లేదు అని కామెంట్స్ పెడుతున్నారు. పోనీ.. ఈ అందాల ఆరబోత అవకాశాల కోసం అనుకుంటే.. రకుల్ అందాన్నీ మెచ్చి ఎలాంటి ఛాన్స్ లు వస్తాయో చూడాలి.

Exit mobile version