Site icon NTV Telugu

Rakul Preet Singh Wedding Pics: రకుల్ పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్.. ఎలా మెరిసిపోతున్నారో చూశారా?

Rakul Marriage Photos

Rakul Marriage Photos

Rakul Preet Singh First Wedding Pics Out: రకుల్ ప్రీత్ సింగ్ ఆమె ప్రియుడు జాకీ భగ్నాని వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 21న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆనంద్ కరాజ్ ఆచారాల ప్రకారం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సింధీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి తర్వాత ఫోటోలు బయటకు వచ్చాయి. ఆమె అభిమానుల నిరీక్షణ ముగిసింది. రకుల్ స్వయంగా తాను మరియు జాకీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిత్రాలను పంచుకుంటూ, రకుల్ ఇలా రాసింది, ‘ఈ రోజు- ఈ భగ్నాని ఎప్పటికీ నావి. ❤️ 21-02-2024 అంటూ పేర్కొంది. ఇక. సెలబ్రిటీలు రకుల్ పోస్ట్‌పై కామెంట్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా, అతియా శెట్టి, వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, సమంతా రూత్ ప్రభు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో సహా పలువురు ప్రముఖులు రకుల్ మరియు జాకీకి శుభాకాంక్షలు తెలిపారు.

ART Cinemas: థియేటర్ల బిజినెస్ లోకి రవితేజ.. ఏషియన్ తో కలిసి అక్కడ మల్టీప్లెక్స్

వధువు రకుల్ అలాగే వరుడు జాకీ భగ్నానీ పెళ్లి ఫొటోలలో చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి కోసం పింక్ కలర్ లెహంగా ధరించింది. ఈ సమయంలో కూడా చేతులకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ధరించి కనిపించింది. అలాగే ఆమె భారీ నగలతో కనిపించని. ఇక ఈ జంట షేర్ చేసిన ఫొటోలలో, జాకీ భగ్నాని రకుల్ ప్రీత్‌ను ప్రేమతో కూడిన కళ్లతో చూస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నానీల ఈ వివాహ ఫోటోలు కొన్ని నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ అందమైన జంటపై అభిమానులు చాలా ప్రేమను కురిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రకుల్, జాకీల పెళ్లికి బాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరయ్యారు. వరుణ్ ధావన్ తన భార్య నటాషా దలాల్‌తో కలిసి వివాహానికి హాజరయ్యారు. వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ కూడా తన భార్యతో కలిసి రకుల్-జాకీల వివాహానికి హాజరయ్యారు. వీరితో పాటు రితీష్ దేశ్‌ముఖ్, భూమి పెడ్నేకర్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా, భార్య తాహిరా కశ్యప్‌తో పాటు ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, మహేష్ మంజ్రేకర్‌లతో పాటు పలువురు తారలు రకుల్-జాకీల ఆనందంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Exit mobile version