Site icon NTV Telugu

Rakul Preet : దేవుడు నాకు చాలా అందం ఇచ్చాడు.. రకుల్ ఓవర్ చేస్తోందే..

Rakul

Rakul

Rakul Preet : అందం గురించి మాట్లాడితే పర్లేదు. కానీ అందంగా ఉంటేనే బెటర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి కామెంట్లు చేయడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ అందం గురించి మాట్లాడింది. తనకు దేవుడు చాలా అందం ఇచ్చాడని.. కాబట్టి తనకు కాస్మొటిక్ సర్జరీ అవసరం లేదని తెలిపింది. తాను అందంగా ఉన్నాను కాబట్టే అవకాశాలు మెరుగ్గా వస్తున్నట్టు చెప్పింది. ఈ రోజుల్లో అందరికీ అన్ని రకాల రోగాలకు మెడిసిన్ దొరుకుతోందని.. కాబట్టి అందంగా కనిపించేందుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకోవడంలో తప్పులేదు అని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియా ఫైర్ అవుతోంది. అందం గురించి అంతగా ఓవర్ చేయడం అవసరమా అంటూ చురకలు అంటిస్తున్నారు.
Read Also : Ameer Khan : ఎందుకూ పనికి రానని బాధపడుతున్నా : స్టార్ హీరో కుమార్తె

నువ్వు అందంగా ఉన్నావని.. అందరూ నీలాగే ఉండాలి అన్నట్టు మాట్లాడటం మంచిది కాదంటున్నారు. పైగా అందంగా లేని వారంతా కాస్మొటిక్ సర్జరీ చేయించుకోవాలి అన్నట్టు రకుల్ కామెంట్లు ఉన్నాయంటున్నారు. నీకు ఒక్కదానికే అందం దేవుడు ఇచ్చాడన్నట్టు ఎందుకు అంటున్నావ్.. అందంగా లేని వారిని కించ పరిచినట్టే నీ వ్యాఖ్యలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేసి విమర్శల పాలు అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో మెరుస్తోంది.

Exit mobile version